కిషన్ రెడ్డి ఔదార్యం.. పోలీసులకు 3 వేల లీటర్ల ఫ్రూట్ జ్యూస్ అందజేత

  • హైదరాబాద్ సిటీ పోలీసుల కోసం ప్యాకెట్లు పంపిన కేంద్ర మంత్రి
  • కమిషనర్ అంజనీ కుమార్ కు అందించిన ఎమ్మెల్సీ రాంచందర్
  • ఈ విషయన్ని ట్విట్టర్ వేదికగా ప్రజలకు తెలిపిన కిషన్ రెడ్డి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. లాక్ డౌన్ తో ప్రజలకు సాయం చేసేందుకు నిత్యం  కష్టపడుతున్న హైదరాబాద్ సిటీ పోలీసులకు మూడు వేల లీటర్ల ఫ్రూట్ జ్యూస్ ను అందించారు. ఈ మేరకు జ్యూస్ ప్యాకెట్లను సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కు పంపించారు. కిషన్ రెడ్డి తరపున బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు బషీర్ బాగ్ లోని సీపీ ఆఫీస్ లో అంజనీ కుమార్ కు అందించారు. ఈ విషయాన్ని కిషన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియజేశారు.

 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి సంవత్సరీకం నిర్వహణ


కరోనా కట్టడి చర్యలను ఢిల్లీ నుంచి పర్యవేక్షిస్తున్న కిషన్ రెడ్డి తన  తల్లి ఆండాళమ్మ సంవత్సరీకం నిర్వహించేందుకు  స్వగ్రామానికి రాలేకపోయారు. దాంతో, ఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన భార్య, సోదరులు, బంధువులు స్వగ్రామం తిమ్మాపూర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోం శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తాను లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాలని అనుకోవడం లేదని కిషన్ రెడ్డి చెప్పారు.


More Telugu News