ఏపీలో కొత్తగా 10 కేసులు... 483కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
- గుంటూరు జిల్లాలో కొత్తగా 5 కేసులు
- రాష్ట్రంలో కరోనాతో 9 మంది మృతి
- మహమ్మారి వైరస్ కు ఆమడదూరంలో శ్రీకాకుళం, విజయనగరం
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 483కి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా మరో 10 పాజిటివ్ కేసులను గుర్తించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో వెల్లడైన ఫలితాల ప్రకారం ఈ వివరాలు తెలిపారు. గుంటూరు జిల్లాలో 5, అనంతపూర్ జిల్లాలో 3, కడప జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
ఇక, రాష్ట్రంలో కరోనా కారణంగా 9 మంది మరణించారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు వదిలారు.
ఓవరాల్ గా 114 పాజిటివ్ కేసులు నమోదైన గుంటూరు జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆ తర్వాత కర్నూలు జిల్లా 90 యాక్టివ్ కేసులతో కరోనాతో పోరు కొనసాగిస్తోంది. ఇక, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరోనా మహమ్మారికి ఆమడదూరంలో నిలిచాయి. ఈ రెండు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.