సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • తొలిసారి జతకడుతున్న నయన్!
  • మహేశ్ అలా ప్లాన్ చేశాడు
  • బన్నీ పాత్రలో శివకార్తికేయన్
 *  తమిళనాట అందరు హీరోలతోనూ కలసి నటించిన కథానాయిక నయనతార ఇప్పుడు తొలిసారిగా కమలహాసన్ సరసన కూడా నటించనుంది. కమల్ హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ 'రాఘవన్' (తమిళంలో 'వేట్టయాడు విలయాడు') చిత్రానికి సీక్వెల్ చేస్తున్నాడు. ఇందులో నయనతారను కథానాయికగా ఎంపిక చేసినట్టు, ఆమె కూడా నటించడానికి ఓకే చెప్పినట్టు కోలీవుడ్ సమాచారం.
*  'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పిన సంగతి విదితమే. ఇక ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల వల్ల ఈ చిత్రం షూటింగ్ ఆలస్యమవుతుండడంతో మహేశ్ ఓ నిర్ణయం తీసుకున్నాడట. షూటింగ్ మొదలుపెట్టాక ఎక్కువ బ్రేక్ లంటూ లేకుండా చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్టు, ఆ విధంగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
*   అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. దాంతో ఈ చిత్రాన్ని పలు భాషల్లోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం తమిళ రీమేక్ లో శివకార్తికేయన్ నటించనున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.


More Telugu News