నిఖిల్ మూవీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ అదే!
- నిఖిల్ చేతిలో రెండు ప్రాజెక్టులు
- విభిన్నమైన కంటెంట్ తో '18 పేజెస్'
- మెమరీ లాస్ హీరో చుట్టూ తిరిగే కథ
ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. ఒకటి '18 పేజెస్' అయితే, మరొకటి 'కార్తికేయ 2'. ఈ రెండు సినిమాలు కూడా విభిన్నమైన కంటెంట్ తోనే రూపొందుతున్నాయి. సుకుమార్ రైటింగ్స్ .. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న '18 పేజెస్' కంటెంట్ చాలా వైవిధ్యభరితంగా వుంటుందట.
కథ సెకండాఫ్ కి చేరుకునేటప్పటికి హీరోను కొన్ని కీలకమైన పరిస్థితులు చుట్టుముడతాయట. అలాంటి పరిస్థితుల్లోనే అతను మెమరీ లాస్ అవుతాడు. మెమరీ లాస్ అనేదే ఈ కథలో కీలకమైన పాయింట్ అట. మెమరీ లాస్ తో అతను ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కున్నాడు? ఎలా విలన్ బృందం ఆటకట్టించాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడు.