దేశమంతా చిరాకుగా చూస్తున్న మాట వాస్తవమే సాయిరెడ్డి: బుద్ధా వెంకన్న
- జగన్‌ని సీఎంగా గుర్తించింది ఒక్క సాయిరెడ్డి గారే
- కరోనా కట్టడికి చేస్తున్న టెస్టులు తక్కువ
- ఇస్తున్న సహాయం తక్కువ
- తాడేపల్లి ఇంటికే జగన్ పరిమితం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. 'దొంగ రెడ్డిది జైలు చరిత్ర. త్వరలోనే జైలు రెడ్డి, పిల్లి గడ్డం తాతయ్య చరిత్ర ముగుస్తుంది. కరోనా దెబ్బకి ప్రజలు అల్లాడుతుంటే తాడేపల్లి ఇంట్లో కూర్చున్న వ్యక్తిని యువ ముఖ్యమంత్రి అంటారా? దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు కరోనా నివారణ చర్యల్లో పాల్గొంటుంటే చీకట్లో బతుకుతున్న జగన్ ని కూడా ఒక ముఖ్యమంత్రి అని గుర్తించింది మీరు ఒక్కరే సాయిరెడ్డి గారు' అని ట్విట్టర్‌లో విమర్శించారు.
'జగన్‌ని నమ్ముకున్న వాళ్లంతా జైలుకి పోయారు.దేశంలోనే ఉత్తమ అధికారులుగా ఉన్న అధికారులు సైతం అధోగతిపాలై రోడ్డున పడ్డారు. ఏ1,ఏ2 ట్రాప్ లో పడి సంతకాలు పెట్టిన రాజకీయ నాయకులు జైలు పక్షులై జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇప్పుడు మరో సారి నాయకులను ట్రాప్ లోకి దింపుతున్నారు. ఇక బలిపశువులు అయ్యే వైకాపా నాయకుల లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చూసుకోండి' అని అన్నారు.
'సిగ్గు వదిలేసిన విజయసాయిరెడ్డి గారు. దేశమంతా రాష్ట్రం వైపు చూస్తుందా? ఎందుకు పారాసిటిమల్, బ్లీచింగ్ పౌడర్ తో జగన్ గారు కరోనాని ఎలా చంపుతున్నారో అని ఆశ్చర్యంగా చూస్తోందా? అసలు కరోనా పెద్ద విషయం కాదు అన్నారు ఇప్పుడు కరోనా కేసులు 534 కి చేరాయి' అని అన్నారు.
'చేస్తున్న టెస్టులు తక్కువ, ఇస్తున్న సహాయం తక్కువ. తాడేపల్లి ఇంటికే పరిమితం అయిన ఇంత అసమర్థ ముఖ్యమంత్రి ఎవరూ ఉండరు అని దేశమంతా చిరాకుగా చూస్తున్న మాట వాస్తవమే సాయి రెడ్డి' అని అన్నారు.