తనయుడి విషయంలో టెన్షన్ పడుతున్న విజయ్!

  • కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్న జాసన్
  • అక్కడ పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్న కరోనా కేసులు
  • తనయుడికి జాగ్రత్తలు చెబుతున్న విజయ్  
ప్రపంచ వ్యాప్తంగా కరోనా తన పంజా విసురుతోంది. ఎక్కడికక్కడ లాక్ డౌన్లు అమల్లో ఉండటంతో, ఎక్కడివారు అక్కడ ఉండిపోయారు. దాంతో అలా చిక్కుబడినవారి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ కూడా 'కెనడా'లో చిక్కుబడ్డాడు. ఏడాది కాలంగా జాసన్ అక్కడ ఫిల్మ్ మేకింగ్ కోర్సును నేర్చుకుంటున్నాడు.

ఇండియాలో లాక్ డౌన్ విధించడంతో జాసన్ కెనడాలోనే ఉండిపోవలసి వచ్చింది. ప్రతిరోజు అక్కడ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అక్కడి వైద్యులు జాసన్ కి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని వచ్చిందట. మళ్లీ మళ్లీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండటంతో, విజయ్ చాలా టెన్షన్ పడుతున్నాడట. ప్రతిరోజూ తనయుడితో మాట్లాడుతూ .. జాగ్రత్తలు చెబుతూ .. ధైర్యం చెబుతూ వస్తున్నాడట. మరో వైపున విజయ్ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.


More Telugu News