యాక్షన్ ఎపిసోడ్ తోనే రంగంలోకి మంచు మనోజ్

  • మంచు మనోజ్ నుంచి 'అహం బ్రహ్మాస్మి'
  • తొలి షెడ్యూల్ హైదరాబాదులో
  • యాక్షన్ సీన్స్ కోసం పీటర్ హెయిన్స్
మంచు మనోజ్ చాలా గ్యాప్ తరువాత ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, 'అహం బహ్మాస్మి' అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవుతుండగానే, కరోనా వైరస్ తన ఎఫెక్ట్  చూపింది. దాంతో రెగ్యులర్ షూటింగు వాయిదా పడింది.

జూలై మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే నిర్ణయానికి మనోజ్ వచ్చాడనేది తాజా సమాచారం. తొలి షెడ్యూల్ మొత్తం హైదరాబాదులోనే ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ అంతా యాక్షన్ ఎపిసోడ్ నే చిత్రీకరించనున్నారని అంటున్నారు. పీటర్ హెయిన్స్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తారట. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాలో మనోజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. హీరోగా .. నిర్మాతగా మనోజ్ ఎలాంటి  ఫలితాన్ని రాబడతాడో చూడాలి.


More Telugu News