తిరుమల రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తున్న ఎలుగుబంట్లు
- లాక్ డౌన్ కారణంగా బోసిపోయిన తిరుమల
- అటవీప్రాంతం నుంచి రోడ్లపైకి వస్తున్న వన్యప్రాణులు
- వీడియో షేర్ చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి
ఏపీలో లాక్ డౌన్ కారణంగా తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులను అనుమతించడం లేదు. దాంతో అక్కడి వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. జనసంచారం లేకపోవడంతో శేషాచల అడవుల నుంచి వస్తున్న వన్యమృగాలు తిరుమల వీధుల్లో దర్శనమిస్తున్నాయి.
తాజాగా, తిరుమల రహదారిపై రెండు ఎలుగుబంట్లు కనిపించాయి. అవి రోడ్డు దాటుతుండగా వీడియో తీశారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ఆ వీడియోను షేర్ చేశారు. ఇటీవలే కొన్ని చిరుతలు కూడా తిరుమలలోని నారాయణగిరి గెస్ట్ హౌస్ వద్ద కనిపించాయి. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారికి నిత్య కైంకర్యాలు తప్ప మరేమీ జరగడంలేదు.