ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్.. ‘రక్తచరిత్ర’ నటుడి అరెస్ట్
- ఫేస్‌బుక్ లైవ్‌లో అభ్యంతరక పోస్టు
- వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా వ్యాఖ్యలు
- గతంలోనూ పలుమార్లు అరెస్ట్
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు చేసినందుకు గాను బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, రక్త చరిత్ర నటుడు అజాజ్ ఖాన్ అరెస్టయ్యాడు. నిన్న ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు. తొలుత సమన్లు జారీ చేసిన ఖర్ పోలీసులు ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేశారు.
వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను అజాజ్‌పై సెక్షన్ 153ఏ తో పాటు పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ఖాన్ గతేడాది జులైలోనూ ఓసారి అరెస్టయ్యాడు. వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉన్న వీడియోలను పోస్టు చేసినందుకు గాను అప్పట్లో అరెస్టయ్యాడు. అంతేకాదు, నిషేధిత మాదకద్రవ్యాలు కలిగినందుకు గాను అక్టోబరు 2018లో ఒకసారి అరెస్ట్ అయినట్టు పోలీసులు తెలిపారు.