పిజ్జాలు తినకపోతే చచ్చిపోతామా? పప్పు ఉడకేసుకుని వేడివేడిగా తింటే సరిపోదా!: సీఎం కేసీఆర్
- తెలంగాణలో మే 7 వరకు లాక్ డౌన్
- స్విగ్గీ, జొమాటో సంస్థలపై నిషేధం
- ప్రజలు ఇళ్లలోనే వండుకుని తినాలని సూచన
తెలంగాణలో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ను మే 7 వరకు కొనసాగిస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇతర దేశాల్లో ఉన్నవాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. మే 7 వరకు తెలంగాణకు రావొద్దు. ఇక్కడ క్యాబ్ ఉండదు, ట్యాక్సీ ఉండదు. చాలా కష్టమవుతుంది. జీఎంఆర్ ఎయిర్ పోర్టు వాళ్లకు కూడా స్పష్టం చేశాం.
నిత్యావసరాలు సరఫరా చేసేవాళ్లకు ఇబ్బందులు ఉండవు. కానీ స్విగ్గీ, జొమాటో వాళ్లపై కొన్నిరోజులు నిషేధం విధిస్తున్నాం. ఒక పిజ్జా సరఫరా చేసే వ్యక్తితో 69 మందికి ఇబ్బందులొచ్చాయని ఢిల్లీలో అన్నారు. ఈ పిజ్జాలెందుకు బొజ్జాలెందుకు? ఏదో ఇంత పప్పు ఉడకేసుకుని వేడివేడిగా తింటే సరిపోదా! నాలుగు రోజుల కష్టపడితే ఏమవుతుంది? పిజ్జాలు తినకపోతే చచ్చిపోతామా? బయటి నుంచి తినుబండారాలు తెప్పించుకోవద్దు. పండుగలు, ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి,.అన్ని మతాలవారికీ ఇది వర్తిస్తుంది" అని స్పష్టం చేశారు.