కరోనాను జయించిన 9 నెలల చిన్నారి.. దేశంలోనే రికార్డు!
- తబ్లిగీ జమాత్‌కు వెళ్లొచ్చిన తండ్రికి కరోనా
- అతడి నుంచి చిన్నారికి సంక్రమణ
- చికిత్సలో ఎక్కువగా మందులు ఉపయోగించలేదన్న వైద్యులు
అత్యంత పిన్న వయసులో కరోనా మహమ్మారిని జయించిన చిన్నారిగా ఉత్తరాఖండ్‌కు చెందిన 9 నెలల పసికందు రికార్డులకెక్కింది. తబ్లిగీ జమాత్‌కు వెళ్లొచ్చిన చిన్నారి తండ్రి కరోనా బారినపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతడి ద్వారా బిడ్డకు వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. కరోనా లక్షణాలతో ఈ నెల 17న చిన్నారి ఆసుపత్రిలో చేరింది. అయితే, విచిత్రంగా ఆరు రోజుల్లోనే మహమ్మారి బారి నుంచి బయటపడింది.
48 గంటల వ్యవధిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా రిపోర్టులు నెగటివ్ రావడంతో చిన్నారిని నిన్న డిశ్చార్జ్ చేశారు. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్నామని వైద్యుడు ఎన్ఎస్ ఖత్రి తెలిపారు. చిన్నారి నుంచి ఆమె తల్లికి మాత్రం వైరస్ సోకలేదన్నారు. చికిత్సలో మందులను ఎక్కువగా ఉపయోగించలేదని ఖత్రి తెలిపారు.