రేపటి నుంచి రైతులకు కూపన్లు అందజేస్తాం: ఏపీ మంత్రి కన్నబాబు
- పంట ఉత్పత్తుల కొనుగోలుకు జనతా బజార్లు
- రైతుల ఉత్పత్తులకు స్థానిక మార్కెట్ కోసమే వీటి ఏర్పాటు
- రైతులకు ఇచ్చే కూపన్ల ద్వారా పంట కొనుగోలు చేస్తాం
రైతుల పంట ఉత్పత్తుల విక్రయానికి జనతా బజార్లు ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రి కన్నబాబు ప్రకటించారు. రైతుల ఉత్పత్తులకు స్థానిక మార్కెట్ ఉండేందుకే జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నామని, రేపటి నుంచి రైతులకు కూపన్లు అందజేస్తామని తెలిపారు. ఆ కూపన్ల ద్వారా పంట కొనుగోలు చేస్తామని చెప్పారు. పంటకు మద్దతు ధర కన్నా ఎక్కువ ధర వస్తే రైతులు అమ్ముకోవచ్చని అన్నారు. తడిసిన శనగలూ కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు.
రాయలసీమ నుంచి అరటి, బత్తాయిని మార్కెట్లకు తరలిస్తున్నట్టు చెప్పారు. టమాట, మిర్చి, అరటి, పసుపు పంటలను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు నష్టం లేకుండా చూస్తున్నామని అన్నారు. ఏపీలో 1,300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ధాన్యానికి రూ.1,760 చొప్పున మద్దతు ధర ఇస్తున్నట్టు తెలిపారు. మే 15న ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా పెట్టుబడి సాయం కింద డబ్బులు జమ అవుతాయని అన్నారు.