చైనాలో మూడో కరోనా వాక్సిన్ రెండో దశ ట్రయల్స్ మొదలు!

  • ఇప్పటికే రెండో దశ ట్రయల్స్ లో రెండు వాక్సిన్ లు
  • తాజాగా సైన్యం తయారు చేసిన వాక్సిన్ తొలి దశ సక్సెస్
  • అధికారికంగా వెల్లడించిన చైనా
చైనాలోని కంపెనీలు తయారు చేస్తున్న కరోనా వాక్సిన్ లో మూడవ వాక్సిన్ కు రెండవ దశ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. తమ దేశ సైన్యానికి చెందిన సంస్థ రూపొందించిన వాక్సిన్ కు రెండో దశ ట్రయల్స్ ప్రారంభించేందుకు అనుమతించామని తెలిపింది.

కాగా, చైనాలో ఇప్పటికే సినోఫామ్ (చైనా నేషనల్‌ ఫార్మా స్యూటికల్‌ గ్రూప్), వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బయొలాజికల్‌ ప్రొడక్ట్స్‌ గతంలోనే తొలి దశ వాక్సిన్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుని రెండో దశలోకి ప్రవేశించాయి. ఈ విషయాన్ని వెల్లడించిన 'క్సిన్హువా' న్యూస్ ఏజన్సీ, ఈ క్లినికల్ ట్రయల్స్ పూర్తయి, అవి ఎంత సురక్షితమో చెప్పడానికి ఓ ఏడాది సమయం పట్టవచ్చని, ఈలోగా ఈ వాక్సిన్ సమర్థత ఎంతో తెలుస్తుందని సినోఫామ్ వెల్లడించినట్టు పేర్కొంది.


More Telugu News