కాలుష్యం తగ్గడంతో 30 ఏళ్ల తర్వాత ఇంటి వద్ద నుంచే క‌నిపిస్తున్న మంచుకొండ‌లు.. అద్భుత ఫొటోలు ఇవిగో

  • యూపీ వాసులకు కనువిందు చేస్తోన్న దృశ్యాలు
  • 200 కి.మీ దూరంలోని మంచుకొండలు కనపడుతున్న వైనం
  • హర్షం వ్యక్తం చేస్తోన్న ప్రజలు
లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వాహనాలు కదలట్లేదు.. కాలుష్యాన్ని వెదజల్లే కర్మాగారాలు పని చేయట్లేదు. దీంతో వాతావరణం అంతా స్వచ్ఛంగా మారిపోయింది. కాలుష్య స్థాయి ఏనాడు లేనంత తగ్గు ముఖం పట్టింది. దీంతో ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్రజలు అద్భుత దృశ్యాలను చూడగలుగుతున్నారు.

                                     
               
దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్త‌రాఖండ్‌లోని మంచుకొండ‌లు యూపీలోని ష‌హ‌రాన్‌పూర్‌ వాసులకు కనపడుతున్నాయంటే కాలుష్యం ఏ మేరకు తగ్గిందో అర్థం చేసుకోవచ్చు. గాలిలో కాలుష్యం కారణంగా ఇన్నాళ్లు అవి ఇక్కడి ప్రజల కంటికి కనపడకుండా పోయాయి.  
                                            
ఇప్పుడు ఆ అద్భుత దృశ్యాలను ఇంటి వద్ద నుంచి చూస్తూ ప్రజలు ఫొటోలు తీస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

                           
దాదాపు 30 ఏళ్ల తరువాత యూపీ నుంచే తాము ఇలా మంచు కొండ‌లను ఇంటి నుంచే చూస్తున్నామని వారు చెప్పారు. పంజాబ్‌లోనూ జ‌లంధ‌ర్‌వాసుల‌కు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని దౌలాధ‌ర్ మంచు కొండ‌లు ద‌ర్శ‌న‌మిస్తున్న విషయం తెలిసిందే. కాలుష్య స్థాయి మరింత పడిపోవడంతో ఇప్పుడు యూపీ వాసులు కూడా ఇంటి నుంచే వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
                         


More Telugu News