మీ పరాక్రమాన్ని, త్యాగాన్ని ఎన్నటికీ మరువలేం: హంద్వారా ఘటనపై ప్రధాని మోదీ స్పందన

  • జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు
  • ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి
  • నివాళులర్పించిన ప్రధాని
జమ్మూకశ్మీర్ లో మరోసారి ఉగ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. కుప్వారా జిల్లాలోని హంద్వారాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది హతులయ్యారు. వారిలో ఓ మేజర్, మరో కమాండింగ్ ఆఫీసర్ ఉన్నట్టు తెలిసింది. మొత్తమ్మీద నలుగురు సైనికులు, ఓ జమ్మూకశ్మీర్ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ అమరులయ్యారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

"హంద్వారాలో అమరులైన మన భద్రతా సిబ్బందికి, ధైర్యశీలురైన సైనికులకు నివాళులు. వారి పరాక్రమం, వారి త్యాగం ఎన్నటికీ మరువలేనిది. దేశం కోసం వారు ఎంతో నిబద్ధతతో సేవలు అందించారు. మన పౌరుల కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.


More Telugu News