కరోనా అధికంగా ఉన్న జిల్లాలకు కేంద్ర బృందాలు

  • దేశంలో 20 జిల్లాల్లో కరోనా తీవ్రత అధికం
  • ఏపీలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా ప్రభావం
  • తెలంగాణలో హైదరాబాద్ జిల్లాలో కరోనా ఉద్ధృతి
దేశం మొత్తమ్మీద 20 జిల్లాల్లోనే కరోనా తీవ్రత ఉన్నట్టు కేంద్రం గుర్తించింది. ఈ మేరకు ఆ 20 జిల్లాలకు ప్రత్యేక ఆరోగ్య బృందాలను పంపిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆయా బృందాలను సిద్ధం చేసింది. ఈ నిపుణుల బృందాలు జిల్లాలకు చేరుకుని స్థానిక ప్రభుత్వాలు, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ కరోనా నివారణకు కృషి చేస్తాయి.

ఏపీలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు కూడా కేంద్ర బృందాలు రానున్నాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 466 కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 319, కృష్ణా జిల్లాలో 266 కేసులు నమోదయ్యాయి. ఇక, తెలంగాణలో హైదరాబాద్ జిల్లాను కరోనా అధికంగా ఉన్న జిల్లాగా గుర్తించారు.


More Telugu News