తెల్లారేసరికి కడుపులో శిశువు మాయమైందంటూ... కలకలం రేపిన మహిళ!

  • గద్వాల సమీపంలోని మానవపాడులో మహిళ వింత ప్రవర్తన
  • నెల రోజుల క్రితమే అబార్షన్ జరిగిందన్న వైద్యులు 
  • సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం అన్న వైద్యురాలు
తాను ప్రసవం కోసం వెళుతుంటే, దేవుడు కనిపించి, ఇంటికి తిరిగి వెళ్లాలని చెప్పాడని, ఆపై ఇంటికి రాగా, కడుపులోని శిశువు మాయం అయిందని పేర్కొంటూ గద్వాల ప్రాంతానికి చెందిన మంజుల అనే మహిళ వింతగా ప్రవర్తించడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, మానవపాడు గ్రామానికి చెందిన మంజుల తాను ప్రసవం కోసం కుటుంబీకులతో కలసి శనివారం రాత్రి ఆసుపత్రికి బయలుదేరగా, దేవుడు కనిపించి, ఇంటికే వెళ్లాలని సూచించాడని చెప్పింది. దీంతో ఇంటికి వెళ్లిన తన కడుపులోని శిశువు తెల్లారేసరికి కనిపించలేదని ఆమె చెబుతూ, వింతగా ప్రవర్తించడం మొదలెట్టింది.

దీంతో వెంటనే ఆమెను బంధువులు ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా, పరీక్షించిన వైద్యులు, నెల రోజుల క్రితమే ఆమెకు అబార్షన్ అయిందని తేల్చారు. ఇక విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్ పర్సన్ సరిత, ఆమెకు మెరుగైన చికిత్సను అందించాలని, అవసరమైతే మరోసారి స్కానింగ్ తీయించాలని ఆదేశించారు. ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ఇదే విషయంలో మంజులకు చికిత్స చేసిన డాక్టర్ దివ్య స్పందిస్తూ, ఆమె మతిస్థిమితం కోల్పోయిందని, అందుకే అలా మాట్లాడుతోందని, ఆమెకు సైకలాజికల్ ట్రీట్ మెంట్ చేయించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.


More Telugu News