క్రిమి నిర్మూలన టవర్ రూపొందించిన డీఆర్డీవో!
- యూవీ బ్లాస్టర్ గా నామకరణం
- అతి నీలలోహిత కిరణాలతో క్రిమి సంహారం
- రసాయన రహితం
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పరిశోధనాలయాలన్నీ ఇప్పుడు కరోనా నేపథ్యంలో నూతన ఆవిష్కరణలు తీసుకువస్తున్నాయి. భారత్ కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) కూడా ఈ కోవలో చేరింది. డీఆర్డీవో పరిశోధకులు తాజాగా అతి నీలలోహిత కిరణాలతో క్రిములను నిర్మూలించే ఓ టవర్ ను రూపొందించారు. దీనికి 'యూవీ బ్లాస్టర్' అని నామకరణం చేశారు.
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డీఆర్డీవో పేర్కొంది. రసాయన రహితంగా క్రిములను నాశనం చేస్తుందని, ఓ గదిలో పది నిమిషాల పాటు దీన్ని ఉంచితే క్రిమివినాశనం జరుగుతుందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీన్ని 30 నిమిషాల పాటు ఆన్ లో ఉంచితే 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్రదేశం క్రిమిరహితంగా మారుతుందనిపేర్కొంది.
ఈ ప్రత్యేక టవర్ ను మొబైల్ ఫోన్ ద్వారా గానీ, ల్యాప్ టాప్ ద్వారా గానీ నియంత్రించవచ్చు. వైఫై లింక్ ద్వారా పనిచేస్తుంది. రసాయనాలతో శుభ్రపరిచేందుకు వీలుకాని ప్రదేశాల్లో ఈ యూవీ బ్లాస్టర్ ఎంతో అనుకూలంగా ఉంటుందని, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.