హైదరాబాదులో పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
- ఉరేసుకున్న స్థితిలో కనిపించిన కానిస్టేబుల్ బాలరాజు
- ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్టు వైద్యుల వెల్లడి
- సంఘటన స్థలంలో దొరకని సూసైడ్ నోట్
హైదరాబాదులో ఓ పోలీసు కానిస్టేబుల్ తన గదిలో అనుమానాస్పద స్థితిలో విగతజీవుడిగా కనిపించడం కలకలం రేపింది. అంబర్ పేట పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతుడిని యు.బాలరాజుగా గుర్తించారు. బాలరాజు వయసు 40 సంవత్సరాలు. పేట్ల బురుజులోని సీఆర్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న బాలరాజు అంబర్ పేటలోని ప్రేమ్ నగర్ కాలనీలో నివసిస్తున్నాడు.
మద్యానికి బానిసైన ఆ కానిస్టేబుల్ ఆదివారం నుంచి తాగుతూనే ఉన్నాడని, సోమవారం నాడు బెడ్ రూంలోకి వెళ్లిన తర్వాత మళ్లీ బయటికి రాలేదని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా స్పందించకపోవడంతో, తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా, సీలింగ్ కు వేలాడుతూ కనిపించాడు. బాలరాజును హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కాగా, ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.