ఢిల్లీలో మళ్లీ కాలుష్యం.. వాతావరణంలో దుమ్ము, ధూళి పెరిగిపోయిన వైనం

  • పగటిపూట చీకటి వాతావరణం
  • లైట్లు వేసుకుని తిరుగుతున్న వాహనదారులు
  • కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు
కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఢిల్లీలో కాలుష్య స్థాయి ఎన్నడూ లేనంత తక్కువ నమోదయిన విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, అక్కడి వాతావరణం మళ్లీ దుమ్ము, ధూళితో నిండిపోయింది. దీంతో పగటిపూటే చీకట్లు అలుముకోవడంతో ఢిల్లీ వాసులు మధ్యాహ్నం సమయంలోనూ వాహనాల లైట్లు ఆన్ చేసుకుని తిరుగుతున్నారు.

ఘాజీపూర్‌ ప్రాంతంలో దుమ్ము, ధూళి మరింత అధికంగా ఉంది. ఢిల్లీలో ఉష్ణోగ్రత తగ్గిపోవడమే కాకుండా, కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. ఢిల్లీలో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.



More Telugu News