అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన సచిన్ టెండూల్కర్
- ‘కరోనా’ పై పోరాడుతున్న తల్లులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
- కొవిడ్-యోధురాళ్ల నిస్వార్థ త్యాగం, సేవలు ప్రశంసనీయం
- నా తల్లితో అనుబంధాన్ని మాటల్లో చెప్పలేనన్న సచిన్
ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ శుభాకాంక్షలు చెప్పాడు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఆన్ లైన్ కార్యక్యమంలో పాల్గొన్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమ వంతు బాధ్యతలు నిర్వరిస్తున్న తల్లులతో మాట్లాడాడు. ఈ పోరాటంలో భాగమైన తల్లులందరికీ తన ధన్యవాదాలు తెలిపాడు. మన కోసం పోరాడుతున్న కొవిడ్-యోధురాళ్ల నిస్వార్థ త్యాగం, సేవలు ప్రశంసనీయమని, బాధ్యతల నిమిత్తం తమ పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చిన తల్లులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నాడు.
ఈ సందర్భంగా తన తల్లి గురించి సచిన్ ప్రస్తావించాడు. చిన్నతనం నుంచి తన తల్లితో తన అనుబంధాన్ని మాటల్లో చెప్పలేనని అన్నాడు. ‘క్రికెట్’ ఆడతానంటే తనను ఎంతగానో ప్రోత్సహించిందని గుర్తుచేసుకున్నారు. స్టేడియంలో తాను క్రికెట్ ఆడుతుంటే ఏనాడూ ప్రత్యక్షంగా చూడని తన తల్లి, తన చివరి టెస్టు మ్యాచ్ చూసేందుకు వాంఖడే స్టేడియంకు వచ్చిందని, మైదానంలోని పెద్ద స్క్రీన్స్ పై తన తల్లి రూపాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యానని అన్నాడు. ‘ఓ అమ్మగా తన భార్య అంజలి కూడా తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తోందని ప్రశంసించాడు. ‘నువ్వు కెరీర్ చూసుకో, పిల్లలను నేను చూసుకుంటా’ అనే భరోసా ఇచ్చిందంటూ అంజలి తనతో అన్న మాటలను సచిన్ గుర్తుచేసుకున్నాడు.