మధ్యాహ్నం తరువాత రాష్ట్రవ్యాప్త సమ్మె... హెచ్చరించిన ఆయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్

  • రవాణా చార్జీల్లో కోత విధించిన ఆయిల్ సంస్థలు
  • సూర్యాపేట సమీపంలో నిలిచిన 500 ట్యాంకర్స్
  • వెంటనే స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త సమ్మె చేస్తామంటున్న యజమానులు
తక్షణం తమకు చెల్లించాల్సిన రవాణా చార్జీలను పూర్తిగా చెల్లించకుంటే, మధ్యాహ్నం తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్స్ ను నిలిపివేస్తామని తెలంగాణ ఆయిల్‌ ట్యాంకర్స్‌ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఆయిల్ సంస్థల నుంచి ట్యాంకర్ల యజమానులకు రావాల్సిన రవాణా చార్జీలను 80 శాతం మేరకు తగ్గించగా, రవాణా కాంట్రాక్టర్లు మూకుమ్మడి సమ్మెకు దిగడంతో, దాదాపు 500 ట్యాంకర్లు సూర్యాపేట సమీపంలో రోడ్లపై నిలిచిపోయాయి. సింగరేణికి కూడా ఇక్కడి నుంచి ఆయిల్ వెళ్లాల్సివుంది. వెంటనే ఆయిల్ సంస్థలు దిగిరాకుంటే, రాష్ట్రం మొత్తం ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేస్తామని యజమానులు హెచ్చరించారు.


More Telugu News