పవన్ సరసన నాయికగా మానస రాధాకృష్ణన్!

  • తెలుగు తెరపై మలయాళ భామల జోరు
  • కేరళలో పుట్టిన మానస రాధాకృష్ణన్
  • మలయాళంలో 10 సినిమాలు చేసిన అనుభవం
తెలుగు తెరపై మలయాళ భామల జోరు కొనసాగుతోంది. అందం .. అభినయంతో మలయాళ భామలు అవకాశాలను అందిపుచ్చుకుంటూ తెలుగులో తమ హవాను సాగిస్తున్నారు. ఇప్పుడు మరో మలయాళ ముద్దుగుమ్మ తెలుగు తెరకి పరిచయం కానున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ ఒక సినిమాను చేయనున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్' వంటి సూపర్ హిట్ రావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ సినిమాలో కథానాయికగా మానస రాధాకృష్ణన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేరళలో పుట్టిన ఈ సుందరి, దుబాయ్ లో పెరిగింది.  ఇంతవరకూ 10 మలయాళ చిత్రాలలో నటించిన మానస రాధాకృష్ణన్, తెలుగులో పవన్ కల్యాణ్ జోడీగా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు.  అయితే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయవలసి వుంది. ప్రస్తుతం ఆమె  మలయాళంలో 'పరమగురు' సినిమా చేస్తోంది. పవన్ తో చేసే సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.


More Telugu News