యూపీకి చేరుకుంటున్న లక్షలాది కార్మికులు.. వెంటాడుతున్న కరోనా భయాలు!

  • 5 రోజుల్లో 4 లక్షల మంది చేరుకున్న వైనం
  • నిన్న ఒక్క రోజే లక్షమంది తిరిగి రాక
  • శ్రామిక్ రైళ్లు, బస్సుల్లో చేరుకుంటున్న కార్మికులు 
ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు చేరుకుంటున్న సంగతి  తెలిసిందే. ఉత్తరప్రదేశ్ కు గత 5 రోజుల్లో ఏకంగా 4 లక్షల మంది కార్మికులు, కూలీలు శ్రామిక్ రైళ్లు, బస్సుల్లో చేరుకున్నారు. నిన్న ఒక్క రోజే లక్ష మంది చేరుకోవడం గమనార్హం. వలస కూలీల కోసం యూపీ ప్రభుత్వం బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి యూపీకి చేరుకుంటున్న కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెపుతున్నారు.

ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇంకా లక్షలాది మంది వస్తారని చెప్పారు. వీరంతా క్వారంటైన్ నిబంధనలను పాటించకపోతే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రానికి తిరిగి వస్తున్న వారిలో ఇప్పటికే పలువురిలో కరోనా లక్షణాలను గుర్తించామని చెప్పారు. సామాజిక నిఘా ఉంచడమే దానికి సరైన పరిష్కారమని చెప్పారు.


More Telugu News