ఆర్మీలో సాధారణ పౌరులకూ అవకాశం... మూడేళ్ల సర్వీసుకు యోచన!
- భారత సైన్యంలో కొత్త ప్రతిపాదనపై చర్చలు
- పారా మిలిటరీ దళాల సిబ్బందిపైనా ఆర్మీ ఆసక్తి
- చర్చిస్తున్న కమాండర్లు
చాలా దేశాల్లో సాధారణ పౌరులకు కూడా సైన్యంలో స్వల్పకాలిక సర్వీసులో పనిచేసే అవకాశం కల్పిస్తారు. కొన్నిదేశాల్లో ఇది నిర్బంధంగా కూడా వర్తింపజేస్తారు. అయితే, ఇకమీదట భారత సైన్యంలోనూ సాధారణ పౌరులకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులను మూడేళ్ల పాటు ఆఫీసర్ హోదాలో సైన్యంలో నియమించే దిశగా ఆర్మీలో చర్చలు జరుగుతున్నాయి.
అంతేకాదు, పారా మిలిటరీ దళాల నుంచి కూడా ఏడేళ్ల పాటు సైన్యంలో పనిచేసే ఒప్పందంపై సిబ్బందిని తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది. కచ్చితంగా ఏడేళ్లు పనిచేసిన తర్వాతే వారిని వారి మాతృసంస్థల్లో పునఃప్రవేశానికి అనుమతించాలన్నది ఆ ప్రతిపాదనలో భాగం. ప్రస్తుతానికి 100 మంది ఆఫీసర్లు, 1000 మంది జవాన్లను తీసుకునేందుకు ఆర్మీ కమాండర్లు చర్చిస్తున్నారని భారత సైన్య అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు.