సరికొత్త ప్రొడక్షన్ వైపు విజయ్ దేవరకొండ అడుగులు

  • ఎంటర్టైన్ మెంట్ రంగంలో వెబ్ సిరీస్ ల హవా
  • వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తున్న స్టార్స్
  • కేవీఆర్ మహేంద్ర డైరెక్షన్ లో వెబ్ సిరీస్ కు ప్లాన్ చేస్తున్న విజయ్
ప్రస్తుతం ఎంటర్టైన్ మెంట్ రంగంలో వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్స్ అందరూ వెబ్ సిరీస్ లపై దృష్టిని సారిస్తున్నారు. సమంత, ప్రియమణి, నందిని రెడ్డి, క్రిష్ తదితరులు ఇప్పటికే వెబ్ సిరీసుల్లోకి దిగిపోయారు.

తాజాగా విజయ్ దేవరకొండ కూడా వెబ్ సిరీస్ కు ప్లాన్ చేశాడు. తాను స్థాపించిన ప్రొడక్షన్ హౌస్ 'కింగ్ ఆఫ్ ది హిల్' ద్వారా వెబ్ సిరీస్ నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని సమాచారం. ఇప్పటికే 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్ కు విజయ్ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.


More Telugu News