లాక్ డౌన్ సడలింపులు.. కోల్ కతాలో తిరిగి అందుబాటులోకి రానున్న ఎల్లో ట్యాక్సీలు!

  • మీటరుపై ప్రస్తుతం ఉన్న ఛార్జీల కంటే 30 శాతం పెంపు
  • ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి
  • కారు వెనుక సీట్లో ప్రయాణికులు కూర్చోవాలని నిబంధన
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కోల్ కతాలో ఎల్లో టాక్సీల సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే,  మీటరుపై ప్రస్తుతం ఉన్న ఛార్జీల కంటే 30 శాతం పెంచారు. ఈ విషయాన్ని బెంగాల్ టాక్సీ అసోసియేషన్ (బీటీఏ) కార్యదర్శి బిమల్ గుహా తెలిపారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ సీనియర్ అధికారులు నిన్న సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఈ మేరకు అధికారులు ప్రతిపాదించారని అన్నారు.  ఈ నెల 18 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఎల్లో టాక్సీల్లో ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గరిష్టంగా ఇద్దరు ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఇద్దరు ప్రయాణికులు వెనుక సీట్లో కూర్చోవాల్సి ఉంటుందని వివరించారు.


More Telugu News