పీఐఎంస్ కు కరోనా వైరస్ తో సంబంధం ఉండొచ్చు: డబ్ల్యూహెచ్ఓ
- అమెరికా, యూరప్ లో పీఐఎంఎస్ బారినపడుతున్న చిన్నారులు
- కవాసాకి వ్యాధి తరహాలోనే ఉందంటోన్న నిపుణులు
- వ్యాధిని సరిగా అర్థం చేసుకోవాల్సి ఉందని డబ్ల్యూహెచ్ఓ సూచన
అమెరికాలోనూ, యూరప్ దేశాల్లోనూ కొందరు చిన్నారులు ఓ అరుదైన వ్యాధితో మరణించడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యాధిని పీడియాట్రిక్ ఇన్ ఫ్లమేటరీ మల్టీసిస్టమ్ సిండ్రోమ్ (పీఐఎంఎస్) అంటారని, అమెరికాలో 100 మంది, యూరప్ దేశాల్లో 230 మంది పిల్లలు ఈ వ్యాధి బారినపడ్డారని తెలుస్తోంది. న్యూయార్క్ లో ముగ్గురు, యూరప్ లో ఇద్దరు చిన్నారులు మరణించారు. అయితే, ఈ వ్యాధికి కరోనాతో సంబంధం ఉండొచ్చని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇది కూడా కవాసాకి అని పేర్కొనే ఓ చిన్నపిల్లల వ్యాధి తరహాలోనే ఉందని, పిల్లల్లో విడవని జ్వరం, చర్మంపై దద్దుర్లు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అథనామ్ స్పందిస్తూ, పిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనా సోకినప్పుడు పిల్లల్లో రోగ నిరోధక శక్తి ప్రమాదకరంగా స్పందించడంతో ఆ ప్రభావం కణజాలంపైనా, ముఖ్యమైన అవయవాలపైనా పడుతోందని నిపుణులు గుర్తించారు.