హృతిక్ రోషన్ పెళ్లి తరువాత నా గుండె బద్ధలైంది: నాటి రోజులను గుర్తు చేసుకున్న మీనా!
- 2000లో హృతిక్ వివాహం
- సాటి అమ్మాయిగా చాలా ఫీల్ అయ్యాను
- తాజాగా సోషల్ మీడియాలో మీనా
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే తనకు చాలా ఇష్టమని, 2000లో హృతిక్ వివాహం తరువాత జరిగిన రిసెప్షన్ కు తాను వెళ్లానని, ఆ సమయంలో అతన్ని అభినందిస్తున్నప్పుడు సాటి అమ్మాయిగా చాలా ఫీల్ అయ్యానని సీనియర్ నటి, ఒకప్పటి అందాల భామ మీనా వ్యాఖ్యానించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా, అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకున్న మీనా, తన ఫేవరెట్ హీరో హృతిక్ పెళ్లి తరువాత బెంగళూరులో విందు కార్యక్రమంలో అతన్ని కలిశానని, ఆ రోజు తన గుండె బద్ధలైందని చెబుతూ ఓ నవ్వుతున్న ఎమోజీని ఆమె పోస్ట్ చేశారు. నాడు హృతిక్ కు శుభాభినందనలు చెబుతున్న ఓ ఫోటోను ఆమె పోస్ట్ చేశారు.
మీనా పోస్ట్ ను చూసిన ఓ నెటిజన్, అజిత్ హీరోగా నటించిన 'విలన్' సినిమాలో మీరు చేసిన ఓ సాంగ్ ను హృతిక్ చాలా మెచ్చుకున్నారని, ఆ ఆర్టికల్ ను తాను చదివానని చెప్పగా, మీనా, మరో ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ పాట షూటింగ్ మంచులో జరిగిందని ఆ సమయంలో హృతిక్ తో పాటు అమితాబ్, కరీనా కపూర్ లు కూడా అక్కడే ఉన్నారని, దట్టంగా మంచు కురుస్తుంటే షూటింగ్ ఆపకపోయేసరికి, తనకేం అవుతుందోనన్న ఆందోళనలో కరీనా తల్లి తనను తిట్టారని గుర్తు చేసుకున్నారు.