తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 1,200 కి.మీ తొక్కుతూ సొంతూరు చేరిన బాలిక
- బీహార్‌లోని దర్భాంగకు చెందిన తండ్రీకూతుళ్లు
- ఉపాధి కోసం ఢిల్లీలో నివాసం
- లాక్‌డౌన్‌తో సొంత గ్రామానికి పయనం
- తండ్రికి గాయాలు కావడంతో సైకిల్ తొక్కిన అమ్మాయి
లాక్‌డౌన్ నేపథ్యంలో సొంత గ్రామానికి వెళ్లే క్రమంలో గాయపడిన తన తండ్రిని ఓ బాలిక (15) సైకిల్‌పై ఎక్కించుకుని 1,200 కిలోమీటర్లు ప్రయాణించింది. బీహార్‌లోని దర్భాంగకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం ఢిల్లీలో తన కూతురితో కలిసి నివసిస్తున్నాడు.
ఇన్నాళ్లు రిక్షా అద్దెకు తీసుకుని, తొక్కుతూ డబ్బులు సంపాదించేవాడు. అయితే, లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు రావడంతో .. దాంతో వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా కిరాయికి తీసుకొచ్చిన రిక్షాను యజమాని తిరిగి తీసుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. మరోపక్క, అదే సమయంలో ఓ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. ఇంకోపక్క ఢిల్లీలో తాను ఉంటోన్న ఇంటి యజమాని అద్దె చెల్లించాలని ఒత్తిడి చేశాడు.
దీంతో సొంతూరికి వెళ్దామని ఓ ట్రక్కు డ్రైవర్‌ను సంప్రదించాడు. అతడు రూ.6 వేలు ఇవ్వాలని అడిగడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. రూ.500లకు ఓ సైకిల్‌ను కొనుక్కున్న ఆ వ్యక్తి ఈ నెల 10వ తేదీన ఢిల్లీ నుంచి దర్భాంగకు సైకిల్‌పై కూతురితో బయల్దేరాడు. తండ్రికి బాగుండకపోవడంతో అతనిని ఎక్కించుకుని సైకిల్ తొక్కుతూ ఆమె సొంతూరికి వచ్చింది. తండ్రీకూతుళ్లను అధికారులు క్వారంటైన్‌కు తరలించి, కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది.