యూజర్ల ప్రొఫైల్ భద్రత కోసం ఫేస్ బుక్ మరో ఫీచర్

  • మరో రెండు వారాల్లో ప్రొఫైల్ లాక్ సదుపాయం 
  • ప్రొఫైల్ ఫొటోల డౌన్ లోడ్ ను నిరోధించే ఫీచర్
  • ఫ్రెండ్ లిస్టులో లేని వ్యక్తుల నుంచి రక్షణ
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యూజర్ల భద్రత కోసం తాజా ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇది ప్రైవసీ సెట్టింగ్స్ కు సంబంధించిన ఫీచర్. సెట్టింగ్స్ లోకి వెళ్లి ఈ సరికొత్త ఫీచర్ ను ఆన్ చేస్తే యూజర్ ప్రొఫైల్ ఇక ఎవరి కంటపడదు. ముఖ్యంగా, స్నేహితుల జాబితాలో లేని వ్యక్తులు తమ ప్రొఫైల్ వివరాలు చూడడం ఇక కుదరని పని. ప్రొఫైల్ ఫొటోలు డౌన్ లోడ్ చేయడం, యూజర్ ఖాతాలోని ఫొటోలు చూడడం, ఇతరుల టైమ్ లైన్ లో పోస్టు చేయడాన్ని ఈ ఫీచర్ నిరోధిస్తుంది. ఈ మేరకు కొత్త ఫీచర్ సాయంతో లాక్ చేసుకోవచ్చని ఫేస్ బుక్ చెబుతోంది. మరో రెండు వారాల్లో ఈ సదుపాయం ఫేస్ బుక్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.


More Telugu News