లాక్డౌన్ పొడిగింపుకే కేసీఆర్ మొగ్గు.. ప్రారంభమైన సమీక్ష సమావేశం
- పరిమిత ఆంక్షలతో కర్ఫ్యూను కూడా పొడిగించే యోచన
- రాష్ట్రవ్యాప్తంగా మరిన్న సడలింపులు
- సమావేశానంతరం పూర్తిస్థాయి వేతనాలపై స్పష్టత
ప్రగతి భవన్లో అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమీక్ష సమావేశం ప్రారంభమైంది. లాక్డౌన్ సడలింపులు, వ్యవసాయ సంబంధ విషయాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, ఈ సమావేశం అనంతరం ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనాల చెల్లింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన నివారణ చర్యలపైనా సీఎం చర్చించనున్నారు.
నిజానికి ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ సడలింపులు ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఈ నెల 31తో రాష్ట్రంలో లాక్డౌన్ ముగియనుండగా, మరిన్ని రోజులు దానిని కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాత్రిపూట అమలు చేస్తున్న కర్ఫ్యూను పరిమిత ఆంక్షలతో ఇంకొన్ని రోజులు కొనసాగించాలన్నది కూడా ప్రభుత్వ నిర్ణయమని చెబుతున్నారు. అలాగే, ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.