ట్రంప్ మధ్యవర్తిత్వం అక్కర్లేదు... చైనాదీ అదే మాట!

  • సరిహద్దుల్లో చైనా, భారత్ సైనికుల మధ్య ఘర్షణ
  • తాను సయోధ్య కుదుర్చుతానన్న ట్రంప్
  • తామే పరిష్కరించుకుంటామన్న భారత్, చైనా
సరిహద్దుల వద్ద భారత్, చైనా బలగాలు ఘర్షణ పడడంతో ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై రెండు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి తాను మధ్యవర్తిత్వం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. అయితే ట్రంప్ మధ్యవర్తిత్వం అవసరంలేదని ఈ విషయంలో భారత్ తన వైఖరి ఇప్పటికే వెల్లడించింది.

తాజాగా చైనా కూడా స్పందించింది. ట్రంప్ జోక్యాన్ని తాము కోరుకోవడంలేదని స్పష్టం చేసింది. 2017లో డోక్లామ్ ఇద్ద ఇలాంటి ఉద్రిక్తతలే చోటుచేసుకున్నాయని, అయితే రెండు దేశాల నాయకత్వాలు సమష్టి ప్రయత్నాలు, వివేకంతో ఆ సమస్యను విజయవంతంగా పరిష్కరించుకున్నాయని, ఇప్పుడు కూడా అలాంటి దృక్పథంతోనే ముందుకెళతామని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. సరిహద్దుల్లో శాంతిని కొనసాగించడమే తమ అభిమతమని పేర్కొంది.


More Telugu News