కరోనాపై పని చేస్తున్న రెమిడీసివిర్... 5 డోసులు మాత్రమే ఇవ్వాలన్న డ్ర‌గ్ కంట్రోల‌ర్ జన‌ర‌ల్ ఆఫ్ ఇండియా

  • కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్న ఎన్నో దేశాలు
  • ఇండియాలో తొలి దశ ట్రయల్స్ లో రెమిడీసివిర్
  • ఫలితాలు బాగున్నాయన్న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా
కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనేందుకు ఎన్నో దేశాల్లోని ఔషధ కంపెనీలు ప్రయత్నిస్తున్న వేళ, ఈ వ్యాధికి యాంటీ వైరల్ ఔషధం రెమిడీసివిర్ పని చేస్తున్నదని తేలడంతో, ఈ ఔషధం వాడేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. అయితే, అత్యవసర పరిస్థితుల్లో కేవలం ఐదు డోసులను మాత్రమే రోగులకు అందించాలని నిబంధన విధించింది.

"అత్యవసర పరిస్థితుల్లో రెమిడీసివిర్ ను వినియోగించేందుకు జూన్ 1 నుంచి అనుమతులు మంజూరు చేశాము. కేవలం ఐదు డోసులు మాత్ర‌మే ఇవ్వాలి" అని డ్ర‌గ్ కంట్రోల‌ర్ జన‌ర‌ల్ ఆఫ్ ఇండియా ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించింది.
 
ఈ ఔషధాన్ని కరోనా వైరస్ సోకిన వారిపై ప్రయోగించగా, మెరుగైన ఫలితాలు కనిపించాయని, అందువల్లే దీన్ని అనుమతించామని కేంద్రం ప్రకటించింది. కాగా, గత నెలలోనే యూఎఫ్ ఎఫ్డీయే రెమిడీసివిర్ వాడకాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. జపాన్ తదితర దేశాలు కూడా దీన్ని వాడి సత్ఫలితాలు పొందాయి.


More Telugu News