స్మార్ట్ ఫోన్ లో చైనా యాప్స్ ను తొలగించే యాప్ ను తీసేసిన గూగుల్ ప్లే స్టోర్!
- మేడిన్ ఇండియా యాప్ 'రిమూవ్ చైనా యాప్స్'
- చైనా యాప్ లను గుర్తించి తొలగించే సూచనలు ఇచ్చే యాప్
- దానితో పాటు 'మిత్రన్'నూ తొలగించేసిన గూగుల్
స్మార్ట్ ఫోన్లలో చైనాకు చెందిన యాప్స్, గేమ్స్ తదితరాలను తొలగించేందుకు సాయపడే మేడిన్ ఇండియా యాప్ 'రిమూవ్ చైనా యాప్స్'ను గూగుల్ తొలగించింది. తన ప్లే స్టోర్ లోని ఈ యాప్ తో పాటు 'మిత్రన్' యాప్ ను కూడా గూగుల్ తొలగించేసింది. 'రిమూవ్ చైనా యాప్స్'ను లోడ్ చేసుకుంటే, ఇది ఫోన్లోని చైనా యాప్స్ ను గుర్తించి, వాటిని తొలగించేందుకు సలహాలు, సూచనలు అందిస్తుందన్న సంగతి తెలిసిందే.
ఇండియా, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో చైనాకు చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలని, ఆ దేశంలో తయారైన యాప్స్ ను స్మార్ట్ ఫోన్ల నుంచి తీసేయాలని విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ పిలుపునివ్వగా, 'రిమూవ్ చైనా యాప్స్' యాప్ కు డిమాండ్ పెరిగింది. ఈ యాప్ ను 'వన్ టచ్ యాప్ ల్యాబ్స్' రూపొందించగా, లక్షలాది మంది ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని, తమ ఫోన్లలోని చైనా యాప్స్ ను తొలగించారు.
ఇదే సమయంలో చైనాకు చెందిన ఫేమస్ వీడియో షేరింగ్ యాప్ 'టిక్ టాక్'కు ప్రత్యామ్నాయంగా 'మిత్రన్' తెరపైకి వచ్చింది. ఈ యాప్ ను కూడా లక్షలాది మంది డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్నారు. తాజాగా గూగుల్ ఈ రెండు యాప్స్ నూ ప్లే స్టోర్ నుంచి తొలగించింది.