మాజీ ప్రేమికులు నయనతార, ప్రభుదేవా సినిమాపై నిర్మాత వివరణ
- రెండేళ్ల క్రితం విశాల్ కార్తీలతో సినిమా
- అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన షూటింగ్
- సినిమా పూర్తి చేయాలనే ఆలోచన లేదన్న నిర్మాత
దక్షిణాది సినీ పరిశ్రమలో నయనతార, ప్రభుదేవాల అనుబంధం ఒకప్పుడు పతాక శీర్షికల్లో ఉండేది. ఇద్దరి ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. ఇదిలావుంచితే, రెండేళ్ల క్రితం విశాల్, కార్తి హీరోలుగా 'కరుప్పు రాజా వెళ్లై రాజా' అనే సినిమా ప్రారంభం అయింది. ఈ చిత్రానికి ఈశ్వరి కె గణేశ్ నిర్మాత. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తోందనే ప్రచారం జరిగింది. ఇందులో నయన్, ప్రభుదేవా కూడా నటించనున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ వార్తలపై నిర్మాత ఈశ్వరి కె గణేశ్ వివరణ ఇచ్చారు. ప్రభుదేవా, నయనతార ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్తల్లో నిజం లేదని చెప్పారు. అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయిందని... ఆ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచన కూడా లేదని అన్నారు.