కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశానంలో గోతిలో విసిరేసిన వైనం
- మానవత్వం మరచిన సిబ్బంది
- నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించని వైనం
- మృతదేహంపై ఓ తెల్లని వస్త్రాన్ని మాత్రమే కప్పిన సిబ్బంది
- అది కూడా ఎగిరిపోయిన వైనం
కొవిడ్-19 సోకి ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని శ్మశానవాటికలోనికి తీసుకొచ్చి గుంతలోకి దాన్ని విసిరేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. మానవత్వం మరచి సిబ్బంది పాల్పడిన ఈ ఘటనపై విమర్శలు వస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో ఓ ఆసుపత్రిలో మృతి చెందాడు. దీంతో నలుగురు సిబ్బంది ఆ మృతదేహాన్ని ఓ బ్యాగులో ఉంచి అంబులెన్స్‌లో శ్మశానవాటికకు తరలించారు.
నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహం కోసం తీసిన గోతిలో విసిరేశారు. అంతేకాక, మృతదేహంపై ఓ తెల్లని వస్త్రాన్ని మాత్రమే కప్పగా, అది కూడా ఎగిరిపోయింది. ఈ ఘటనపై విమర్శలు రావడంతో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.