నా సోదరుని కుమారుడు అష్ట ఐశ్వార్యాలతో తులతూగాలి: మోహన్ బాబు

  • సా సోదరుని కుమారుడు బాలకృష్ణ
  • 100 ఏళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి
  • మోహన్ బాబు శుభాకాంక్షలు
  • సాహసానికి వెనుకాడని నటసింహమన్న గల్లా జయదేవ్
నేడు బాలయ్య 60వ పుట్టిన రోజు సందర్భంగా మోహన్ బాబు, తన ట్విట్టర్ వేదికగా శుభాభినందనలు తెలిపారు. "నా సోదరుని కుమారుడు నందమూరి బాలకృష్ణ 100 సంవత్సరాలు అష్ట ఐశ్వర్య  ఆయురారోగ్యములతో నిండు నూరేళ్ళు పుట్టిన రోజులు జరుపుకోవాలని నా హృదయపూర్వకముగా షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను" అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. దీన్ని నారా బ్రాహ్మణి సైతం రీట్వీట్ చేశారు.

ఇదే సమయంలో "పాత్ర కోసం ఎంతటి సాహసం చేయడానికైనా వెనకాడని నందమూరి నట సింహం, 60 వసంతాలు పూర్తి  చేసుకున్న సందర్భముగా  బాలయ్య బాబుకి  పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ, తెలుగు వారి అభినందనలు పొందుతూ, మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను" అంటూ గల్లా జయదేవ్ పెట్టిన ట్వీట్ ను కూడా బ్రాహ్మణి రీట్వీట్ చేశారు.


More Telugu News