కష్టాలలో వున్న తమ టీచర్ కి... ఆర్థిక సాయం చేసిన నెల్లూరు విద్యార్థులు!
- అడ్మిషన్లు చేయించలేదని ఉద్యోగం నుంచి తొలగింపు
- అరటి పళ్ల వ్యాపారం పెట్టుకున్న ఉపాధ్యాయుడు
- స్పందించి సాయం చేసిన పూర్వ విద్యార్థులు
రానున్న విద్యా సంవత్సరానికి చాలినన్ని అడ్మిషన్లను చేయించలేదన్న కారణంగా ఓ ప్రముఖ విద్యా సంస్థలో పని చేస్తున్న ఉపాధ్యాయుడుని ఉద్యోగం నుంచి తొలగించారు. సదరు ఉపాధ్యాయుడు, ఉద్యోగం పోగొట్టుకుని అరటిపళ్లను అమ్ముకుంటూ, కుటుంబాన్ని పోషిస్తున్నారు. నెల్లూరు వేదాయపాళెంలోని ఓ పాఠశాలలో పని చేసి, ఉద్యోగం పోగొట్టుకున్న వెంకటసుబ్బయ్య అనే ఈ వ్యక్తి, ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిసి, ఆయన వద్ద గతంలో చదువుకున్న విద్యార్థులు స్పందించారు. తమ గురువుకు రూ. 86,300 ఆర్థిక సాయాన్ని అందించారు.
గతంలో ఆయన వద్ద చదువుకున్న శ్యామ్ అనే వ్యక్తి, ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. విషయం తెలిసి మాస్టారి ఖాతాలో రూ. 50 వేలు జమ చేశాడు. వైసీపీ యువజన సోషల్ మీడియా ఆధ్వర్యంలో కూడా రూ. 20 వేలను ఆయనకు అందించారు. తన వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులు చేసిన సాయంపై వెంకటసుబ్బయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.