ఇంగ్లీషు ఆల్ఫాబెట్స్ లో 'యూ' ఫర్ 'అగ్లీ'... పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలు!
- ప్రభుత్వ పాఠశాలలో ఆమోదించని పుస్తకం
- నల్లగా ఉన్న పిల్లాడి పక్కనే 'యూ ఫర్ అగ్లీ'
- దాన్నే నేర్పించిన టీచర్ల సస్పెన్షన్
విద్యార్థులకు 'ఏ ఫర్ యాపిల్', 'బీ ఫర్ బాల్'.. అంటూ ''యూ ఫర్ అంబ్రెల్లా' అని చెప్పాల్సిన టీచర్లు,'యూ ఫర్ అగ్లీ' అని చెప్పి సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, తూర్పు బురుద్వాన్ జిల్లాలోని ఓ ప్రాధమిక పాఠశాలలో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ పుస్తకంలోని 'యూ ఫర్ అగ్లీ' అన్న పదాన్ని నేర్పిస్తున్నారు. ఆ పక్కనే నల్లగా ఉన్న ఓ అబ్బాయి బొమ్మ కూడా ఉంది.
ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, ఉన్నతాధికారులు విచారించారు. "ఈ పుస్తకాన్ని విద్యా శాఖ ఆమోదించలేదు. అయినా సదరు పాఠశాలలో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ తరహా ఘటనలను ఏ మాత్రమూ అంగీకరించబోము. ఇవి విద్యార్థుల మనసులను పాడు చేస్తాయి. ఆ ఇద్దరు టీచర్లనూ విధుల నుంచి తొలగించాము" అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పార్థ చటర్జీ మీడియాకు వెల్లడించారు.
స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే ఈ ఘటన జరిగిందని, వారిపై విచారణ తరువాత కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పాఠశాల మూసివేయబడివుంది. ఆ సమయంలో ఓ విద్యార్థి తండ్రి, పుస్తకం తీసుకుని తన పిల్లాడికి పాఠం చెబుతూ, పాఠ్యాంశాల్లోని తప్పులను కనుగొని, ఇతర విద్యార్థుల పేరెంట్స్ కు, ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.