వారాన్ని లాభాలతో ముగించిన మార్కెట్లు

  • 242.52 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 70.90 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • చివరి గంటలో లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత భారీ నష్టాలలోకి జారుకున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ పదకొండు వందల పాయింట్లకు పైగా నష్టపోయింది. అయితే, చివర్లో కొనుగోళ్లు పుంజుకోవడంతో అనూహ్యంగా చివరి గంటలో మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి.

 ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 242.52 పాయింట్లు లాభపడి 33,780.89కి పెరిగింది. నిఫ్టీ 70.90 పాయింట్లు పుంజుకుని 9,972.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో 1,224 షేర్లు అడ్వాన్స్ కాగా, 1,226 షేర్లు పడిపోయాయి. 150 షేర్లు స్థిరంగా ఉన్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటో కార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో కంపెనీలు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ లు టాప్ లూజర్లుగా నిలిచాయి.


More Telugu News