ఈ పరిణామాలు రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళతాయో!: దేవినేని ఉమ

  • జే టాక్స్ రూపంలో కప్పం కట్టాల్సిన పరిస్థితులు 
  • పరిణామాలను ఊహించడానికే భయపడుతున్న ప్రజలు
  • అచ్చెన్నను తెల్లవార్లు తిప్పారు
  • 24 గంటల తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లారు
ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూ సీఎం జగన్ సర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. 'ఏపీలో రాజకీయ పార్టీలతో సంబంధంలేని వారు కూడా కష్టపడి వ్యాపారం చేసి సంపాదించిన సొమ్ములో కొంతభాగాన్ని జే టాక్స్ రూపంలో కప్పం కట్టాల్సిన పరిస్థితులు కల్పించారు. ఈ పరిణామాలు రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళతాయోనని ఊహించడానికే భయపడుతున్న ప్రజలకు సమాధానం చెప్పండి జగన్ గారూ' అని దేవినేని ఉమ ట్వీట్లు చేశారు.

అరెస్టు అనంతరం ఆసుపత్రిలో చేర్చేవరకు అంబులెన్సులోనే టీడీపీ నేత అచ్చెన్నాయుడు నరకం అనుభవించారని వచ్చిన వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. 'శస్త్ర చికిత్స జరిగిందని దారిలో గుర్తించారంట.. అయినా తెల్లవార్లు తిప్పుడే.. 24 గంటల తరువాత ఆసుపత్రికి. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అచ్చన్న, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అక్రమ అరెస్ట్. నేర స్వభావికి అధికారమిస్తే ఇంతేనని చంద్రబాబు గారు, ప్రజలు అంటుంది నిజమేకదా చెప్పండి జగన్ గారూ' అని ఆయన ప్రశ్నించారు.


More Telugu News