నా కెరీర్ నాశనం కావడానికి ఆయనే కారణం: గుత్తా జ్వాల

  • నా సత్తా ఏంటో గోపీచంద్ కు తెలుసు
  • నాకు మద్దతుగా ఉంటాడని అనుకున్నా
  • ఆయన వల్లే నా కెరీర్ నాశనమైంది
షటిల్ బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పై షటిల్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తీవ్ర ఆరోపణలు చేశారు. తన కెరీర్ నాశనం కావడానికి గోపీచంద్ కారణమని అన్నారు. తాను ఎదుర్కొన్న వేధింపులకు ఆయనే కారణమని... ఈ విషయాన్ని తాను బహిరంగంగా చెప్పగలనని తెలిపారు. బ్యాడ్మింటన్ లో తన సత్తా ఏంటో ఆయనకు తెలుసని... తనకు మద్దతుగా ఉంటాడని భావించానని... అయితే తనతో కాకుండా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో ఆయన ఆడేవాడని చెప్పారు.

ఒకప్పుడు అగ్రశ్రేణి ఆటగాళ్లు మన రాష్ట్రం నుంచి వచ్చేవారు కాదని... కానీ ఒక దశాబ్ద కాలంగా హైదరాబాదులోని గోపీచంద్ అకాడమీ నుంచే వస్తున్నారని గుత్తా జ్వాల తెలిపింది. గోపీచంద్ అకాడమీ వారికైతేనే గుర్తింపు వస్తుందని చెప్పారు. మన దేశానికి పతకం వస్తే గోపీచంద్ వల్ల వచ్చినట్టు చెప్పుకుంటారని... రాకపోతే ఇతరుల మీదకు నెట్టేస్తారని అన్నారు.  

2004లో గుత్తా జ్వాల, గోపీచంద్ ఇద్దరూ కలిసి మిక్స్ డ్ డబుల్స్ లో జాతీయ ఛాంపియన్ షిప్ సాధించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత  ఇద్దరి మధ్య దూరం పెరిగింది.


More Telugu News