కడప స్టీల్ ప్లాంట్ కు ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని సీఎం జగన్ ఆదేశాలు

  • కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సీఎం సమీక్ష
  • రెండు నెలల్లో భాగస్వామ్య సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశం
  • మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని సూచన
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఎస్సార్ స్టీల్స్, టాటా స్టీల్స్, హ్యుందాయ్ తదితర సంస్థలతో జరిపిన చర్చల తాలూకు వివరాలను అధికారులు సీఎం జగన్ కు వివరించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో రెండు నెలల్లోగా ఒప్పందం కుదుర్చుకోవాలని  సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కడప స్టీల్ ప్లాంట్ కు ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని ఆదేశించారు. ఫ్యాక్టరీ నిర్మాణం దిశగా మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.


More Telugu News