ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- అమ్మకాలకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 97 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 32 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం సమయం వరకు సూచీలు లాభాల్లోనే ఉన్నాయి. అయితే, చైనా విషయమై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రధాని మోదీ సిద్ధమవడంతో... ఇన్వెస్టర్లలో కొత్త భయాలు మొదలయ్యాయి. పరిస్థితి తీవ్రంగానే ఉందనే అంచనాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 33,507కి పడిపోయింది. నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 9,881 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (4.15%), భారతి ఎయిర్ టెల్ (3.43%), యాక్సిస్ బ్యాంక్ (2.10%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.08%), బజాజ్ ఫైనాన్స్ (1.31%).
టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.00%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.92%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.58%), హీరో మోటో కార్ప్ (-1.36%).