ఇంట్లోనే తేలికగా కరోనా పరీక్ష ఎలా చేసుకోవచ్చో చెబుతున్న న్యూజిలాండ్ డాక్టర్ సంధ్య!
- కరోనాపై సమాధానాలు లేని ప్రశ్నలెన్నో
- ఇంట్లోనే వైరస్ ను గుర్తించేందుకు సులువైన విధానాలు
- ఒక పల్స్ ఆక్సీమీటర్ చాలు
- రెండు పెద్ద బెలూన్లు ఉన్నా సరే
- ఆక్లాండ్ జనరల్ ప్రాక్టీషనర్ సంధ్యా రామనాథన్
కరోనా వైరస్ పై మనసులో మెదిలే ప్రశ్నలెన్నో... వివిధ పనులు, ఆఫీసు పనుల నిమిత్తం బయటకు వెళ్లి వచ్చేవారు, తమకు వైరస్ ఏమైనా సోకిందా? అన్న ఆందోళనతో కాలం గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిత్యమూ వైరస్ గురించి పరీక్ష చేయించుకునేందుకు వెళ్లే అవకాశాలు ఎవరికీ ఉండవు. అయితే, ఇలా సతమతమవుతున్న వారి కోసం న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో జనరల్ ప్రాక్టీషనర్ గా పని చేస్తున్న భారత సంతతి వైద్యురాలు సంధ్యా రామనాథన్, కొన్ని సలహాలు, ఇంట్లోనే కరోనా పరీక్ష ఎలా చేసుకోవచ్చన్న విషయాన్ని చెబుతూ, ఓ వీడియోను విడుదల చేయగా, అది తెగ వైరల్ అవుతోంది.
ఇంట్లోనే పల్స్ ఆక్సీమీటర్ తో కరోనా ఉందా? అన్న విషయాన్ని గుర్తించవచ్చని ఆమె చెబుతున్నారు. అన్ని చోట్లా దొరికే, ఈ మిషన్ ను చూపుడు వేలుకు తగిలిస్తే, శరీరంలో ఆక్సిజన్ ఏ మేరకు సరఫరా అవుతుందన్న విషయాన్ని వెల్లడిస్తుందని, మీటర్ రీడింగ్ 95 నుంచి 100 మధ్యలో ఉండాలని, 93 కన్నా తక్కువగా చూపిస్తే మాత్రం డాక్టర్ ను సంప్రదించాలని అన్నారు. శరీరంలోకి కరోనా ప్రవేశించిన తరువాత, తొలుత ఆక్సిజన్ సరఫరా రేటు తగ్గుతుందని ఆమె గుర్తు చేశారు.
ఇక రెండు పెద్ద బెలూన్లు తీసుకుని, వాటిలోకి గాలిని ఊదడం ద్వారా ఎంత వేగంగా గాలిని వదులుతున్నారు? శ్వాసను ఎంతవరకూ ఆపగలుగుతున్నారన్న విషయాలను తెలుసుకోవచ్చని, శరీరంలో వైరస్ ఉంటే, ఊపిరిని ఎక్కువసేపు నిలిపి ఉంచలేరని సంధ్య వెల్లడించారు. ఇదే సమయంలో శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేలా నిత్యమూ జింక్, విటమిన్ డీ, సీ తదితరాలు ఉండే పండ్లను, ఆహారాన్ని తీసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటిస్తూ, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు.
ఒకవేళ వైరస్ సోకితే మాత్రం, తరచూ వేడి నీళ్లతో నీటిని పుక్కిలిస్తూ ఉండాలని, నాజల్ స్ప్రేను వినియోగించాలని సంధ్య సలహా ఇచ్చారు. కరోనా సోకితే, వైరస్ ఊపిరితిత్తుల గోడల్లోని చివరి భాగాన అతుక్కుని ఉంటుందని, దానిని బయటకు పంపేందుకు శ్వాస వ్యాయామాలు చేయాలని, అప్పుడే వైరస్ నుంచి త్వరగా కోలుకోవచ్చని అన్నారు.