ఈ నెల 27న సినీ నటి వనిత వివాహం
- 1995లో సినీ రంగంలోకి ప్రవేశించిన వనిత
- 2000వ సంవత్సరంలో సినీ నటుడు ఆకాశ్‌తో పెళ్లి
- 2007లో వ్యాపారవేత్త ఆనంద్ జయదర్షన్‌తో రెండోపెళ్లి
- 2020 జూన్ 27న పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం
ప్రముఖ సినీ నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు, సినీనటి, బిగ్ బాస్-3 ఫేమ్ వనిత విజయకుమార్ మూడో పెళ్లి చేసుకోనుంది. 1995లో సినీ రంగంలోకి ప్రవేశించిన ఆమె.. 2000 ఏడాదిలో సినీ నటుడు ఆకాశ్‌ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి చిహ్నంగా ఓ కొడుకు, కూతురు ఉన్నారు. 2005లో వారిద్దరు విడిపోయారు.
దీంతో 2007లో వ్యాపారవేత్త ఆనంద్ జయదర్షన్‌ను ఆమె రెండోపెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు చిహ్నంగా ఒక కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయి విడాకులు తీసుకున్నారు. అనంతరం డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్‌తో ఆమె సహజీవనం చేసింది.
మరోవైపు, ఈ నెల 27న చెన్నైలో ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపే ఓ శుభలేఖ బయటకు వచ్చింది. పీటర్ పాల్ అనే వ్యక్తితో వనిత పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. ఈ వార్తలు నిజమేనని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. త్వరలోనే మీడియాకు అధికారికంగానూ ప్రకటన చేస్తానని చెప్పింది. ఓ బిగ్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తోన్న సమయంలో తాను పీటర్‌ను కలిశానని ఆమె వివరించింది. చేదు అనుభవాల అనంతరం కూడా ప్రేమను పొందే అవకాశాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయని వ్యాఖ్యానించింది.