కనీసం అచ్చెన్నాయుడుని కలిసే అవకాశం కూడా లభించడం లేదు: టీడీపీ నేత రామానాయుడు
- వైసీపీ అధికారంలోకి వచ్చాక దాడులు పెరిగాయి
- అచ్చెన్నపై జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది
- వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, బీసీలపై దాడులు ఎక్కువయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పౌరహక్కులకు భంగం కలిగిస్తున్నారని... ఈ వ్యవహారంపై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశామని చెప్పారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడుని కలిసే అవకాశం కూడా లభించడం లేదని... చివరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ను కలిసి అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై వివరాలను తెలుసుకున్నామని అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పందించారు.
అచ్చెన్నకు ఆపరేషన్ జరిగి 24 గంటలు కూడా గడవక ముందే... రోడ్డు మార్గంలో 600 కిలోమీటర్లు ప్రయాణం చేయించారని రామానాయుడు మండిపడ్డారు. ఆయనకు బ్లీడింగ్ ఆగడం లేదని, దీంతో నిన్న మళ్లీ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారని అన్నారు. అచ్చెన్నపై జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని విమర్శించారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరాటం చేస్తామని చెప్పారు.