10 మంది భారత జవాన్లను విడిచిపెట్టిన చైనా
- భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు
- లడఖ్‌లో ఇటీవల ఘర్షణ
- భారత సైనికులను అదుపులోకి తీసుకున్న చైనా
- మొత్తం 76 మంది భారత సైనికులకు గాయాలు
తూర్పు లడఖ్‌లో భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చైనా అదుపులోకి తీసుకున్న 10 మంది భారత సైనికులను ఆ దేశం విడిచిపెట్టింది.
ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో భారత సైనికులను చైనా విడుదల చేసింది. వారిలో ఓ లెఫ్టినెంట్ కల్నల్, ముగ్గురు మేజర్లు కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన ఘర్షణలో మొత్తం 76 మంది భారత సైనికులు గాయాలపాలైనట్లు తెలిసింది. వారిలో చాలా మంది ఇప్పటికే కోలుకున్నారు.