ట్విట్టర్ లో కొత్త ఫీచర్... ఇకపై మాటే ట్వీట్ అవుతుంది!
- ట్విట్టర్ లో వాయిస్ ట్వీట్ ఫీచర్
- 140 సెకన్ల నిడివి ఆడియోను ట్వీట్ గా మలిచే వెసులుబాటు
- తొలుత ఆపిల్ ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో కొత్త ఫీచర్
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఓ కొత్త ఫీచర్ తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇకపై వాయిస్ ట్వీట్లు చేసుకునే సదుపాయాన్ని ఈ ఫీచర్ ద్వారా పొందవచ్చు. అంటే మాటలే ట్వీట్లుగా మారతాయి. టైపింగ్ చేయాల్సిన అవసరం లేకుండా, ట్వీట్ చేయాల్సిన సందేశాన్ని పలికితే చాలు, అది ట్వీట్ గా రూపాంతరం చెందుతుంది.
అయితే ఇందుకు ఓ పరిమితి ఉంది. సింగిల్ వాయిస్ ట్వీట్ నిడివి 140 సెకన్లు మాత్రమే. ఆ వ్యవధిలో ఎన్ని పదాలు పలికితే అన్ని పదాలు ట్వీట్ అవుతాయి. ట్వీట్ కంపోజర్ స్క్రీన్ పై ఈ ఫీచర్ కోసం 'వేవ్ లెంగ్త్స్' అనే ఆప్షన్ పొందుపరిచారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ను ప్రయోగాత్మకంగా పరిమిత సంఖ్యలో ఆపిల్ ఐఓఎస్ యూజర్లకు అందించనున్నారు.